Advertisementt

వంశీ పైడిపల్లికి హీరో దొరికాడా?

Thu 25th Apr 2024 12:09 AM
vamshi paidipally  వంశీ పైడిపల్లికి హీరో దొరికాడా?
Vamshi Paidipally Next Hero Confirmed వంశీ పైడిపల్లికి హీరో దొరికాడా?
Advertisement
Ads by CJ

తమిళ స్టార్ హీరో విజయ్‌తో వారసుడు చిత్రం చేశాక.. దర్శకుడు వంశీ పైడిపల్లిపై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. వారిసు చిత్రాన్ని సీరియల్‌లా తీశాడంటూ నెటిజెన్స్ వంశీ పైడిపల్లిని ఆడుకున్నారు. మహర్షి తర్వాత మహేష్‌తో సినిమా చేయాలని చూస్తున్న వంశీ పైడిపల్లికి మహేష్ ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుకే వంశీ పైడిపల్లి కథని రాసుకుని హీరో వేటలో ఉన్నాడంటున్నారు. 

తాజాగా వంశీ పైడిపల్లికి హీరో దొరికినట్లుగా తెలుస్తోంది. అది కూడా సౌత్ హీరో కాదట. ఏకంగా వంశీ పైడిపల్లికి బాలీవుడ్ హీరో దొరికాడంటున్నారు. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్-వంశీ పైడిపల్లి చిత్రం ఆల్మోస్ట్ ఓకే అయ్యింది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షాహిద్ ఇప్పటికే సౌత్ డైరెక్టర్ సందీప్ వంగాతో కబీర్ సింగ్ చేశాడు. 

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ వంశీ పైడిపల్లి షాహిద్ కపూర్‌తో ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారో అనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో మొదలైంది. ఈ కాంబో పై అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

Vamshi Paidipally Next Hero Confirmed:

Movie in Vamshi Paidipally and Shahid Kapoor Combo

Tags:   VAMSHI PAIDIPALLY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ