ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న మంజుమ్మల్ బాయ్స్ మళయాళంలోనే కాదు.. డబ్ అయ్యి విడుదలైన ప్రతి భాషలోనూ మంజుమ్మల్ బాయ్స్ మంచి కలెక్షన్స్ సాధించడంతో.. ఈ చిత్ర ఓటీటీ డేట్ పై ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ హిట్ చిత్రాన్ని ఓటీటీలో వీక్షిద్దామా అని ఆతృతతో కనబడుతున్నారు.
అయితే మంజుమ్మల్ బాయ్స్ డిజిటల్ హక్కులని దక్కించుకున్న డిస్ని ప్లస్ హాట్ స్టార్ వారు ఇంకా మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ డేట్ కన్‌ఫర్మ్ చెయ్యకుండా సస్పెన్స్ లో పెడుతున్నారు. ఈమధ్యనే మంజుమ్మల్ బాయ్స్ అతి త్వరలోనే ఓటీటీ స్ట్రామింగ్ అన్న హాట్ స్టార్ ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చింది.
మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ పాన్ ఇండియా భాషల్లో రానున్నట్టుగా తెలిపారు. మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూ మంజుమ్మల్ బాయ్స్ రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా తేదీ రివీల్ చేయడమే బాకీ ఉందని చెప్పడంతో.. ఓటీటీ ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.