సమంత హెల్త్ రీజన్స్‌తో నటనకి బ్రేకిచ్చింది. హెల్త్ రీజన్స్ అనే కాదు.. కొద్దిరోజులుగా సమంతకి స్టార్ హీరోల సినిమా నుంచి అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. యూటర్న్, ఓ బేబీ, యశోద, శాకుంతలం లాంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్‌తో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సమంతకి చాలా కాలంగా స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదు.
పుష్ప ద రైజ్ లో ఊ అంటావా మావా అంటూ రెచ్చిపోయి అందాలు ప్రదర్శించినా ఆమెని లైట్ తీసుకుంటున్నారు. దానికి తోడు ఆమెకి అనారోగ్య కారణాల వలన ఫేస్‌లో గ్లో తగ్గిపోయింది. అందుకే పర్ఫెక్ట్‌గా కమ్ బ్యాక్ కోసం ఆమె నానా తంటాలు పడుతుంది. శృతిమించే అందాలతో గ్లామర్ షో చేస్తుంది. అందాలు చూపించడానికి హద్దులు లేవన్నట్టుగా పూటకో ఫోటో షూట్ తో రెచ్చిపోతుంది.
సమంత మాత్రమే కాదు.. మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అవకాశాల కోసం ఏమైనా చేస్తుంది అనేంతగా గ్లామర్ షో చేస్తుంది. పెళ్లయ్యింది, బాబు పుట్టాడు. అయినా అవకాశాలతో బిజీగానే ఉంటున్న కాజల్‌కి ఈ ఆఫర్స్ సరిపోవడం లేదు. స్టార్ ఛాన్సెస్, బిగ్ బడ్జెట్ మూవీస్‌లో ప్లేస్ కావాలనుకుంటుందేమో.. అందుకే అందాల ప్రదర్శనకు దిగిందా అనేలా ఆమె లేటెస్ట్ ఫోటో షూట్స్ ఉంటున్నాయి.
అటు సమంత, ఇటు కాజల్ ఇద్దరూ అందాలు చూపించడంలో పోటీ పడడం చూసిన వారు కమ్ బ్యాక్ కోసం హీరోయిన్స్ కష్టాలంటూ కామెంట్ చేస్తున్నారు.