Advertisementt

రజినీకాంత్ కూలీ లో కింగ్ నాగ్

Tue 23rd Apr 2024 02:53 PM
nagarjuna  రజినీకాంత్ కూలీ లో కింగ్ నాగ్
Nagarjuna In Rajinikanth Coolie Movie రజినీకాంత్ కూలీ లో కింగ్ నాగ్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న #Thalaivar171 చిత్ర టైటిల్ టీజర్ ని విడుదల చేసారు. Thalaivar 171 కి కూలి అనే టైటిల్ పెట్టిన లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ ని ఈ చిత్రంలో పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్టుగా ఫస్ట్ లుక్ లోనే స్పష్టతనిచ్చాడు. అయితే ఈచిత్రంలో లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ కోసం మరో తెలుగు హీరో హెల్ప్ తీసుకోబోతున్నట్టుగా కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. 

అదే కింగ్ నాగార్జున రజినీకాంత్ చిత్రంలో స్పెషల్ రోల్ చేయబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. అది ఇప్పుడు నిజమనేలా నాగార్జున-లోకేష్ కనగరాజ్ మీటయిన పిక్ ఒకటి బయటికి వచ్చింది. ఇది చూస్తే నాగార్జున ఖచ్చితంగా రజినీకాంత్ కూలి లో నటిస్తున్నారని క్లారిటీ వస్తుంది. ఇప్పటికే నాగార్జున ధనుష్-శేఖర్ కమ్ముల మల్టీస్టారర్ కుబేర లో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. 

ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంలో నాగార్జున నటించబోతున్నారు. అయితే ఇందులోనూ నాగార్జున కీలక పాత్రలోనే కనిపిస్తారని తెలుస్తోంది. 

Nagarjuna In Rajinikanth Coolie Movie:

Nagarjuna In Lokesh Kanagaraj, Rajinikanth Coolie Movie

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ