ఏపీలో ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు తలమునకలై ఉన్నాయి. ఇక ఇప్పుడు నామినేషన్ల పర్వం మొదలయ్యింది. ఎమ్యెల్యే కేండిడేట్స్, ఎంపీ కేండిడేట్స్ అందరూ తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్ వేసేందుకు ముహుర్తాలు పెట్టుకుని మందీమార్బలంతో రెడీ అవుతున్నారు.
నేడు మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నామినేషన్ తో పాటుగా తన ఆస్తుల వివరాలతో అఫిడవిడ్ ని సబ్ మీట్ చేస్తారు. అయితే పవన్ అఫడవిట్ లో ఏముందో అనే ఆతృతలో పవన్ ఫాన్స్ కనిపిస్తున్నారు. ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు ఈ అఫడవిట్ లో పొందుపరుస్తారు.
పిఠాపురం అసెంబ్లీ జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చెయ్యబోతున్నారు పవన్
పిఠాపురం నియోజకవర్గం లోని చేబ్రోలు లోని పవన్ నివాసం నుండి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం వరకు భారీ ర్యాలీగా చేరుకోనున్న పవన్
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన, బిజెపి నేతల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
గొల్లప్రోలు పట్టణం, పిఠాపురం పట్టణం మీదుగా పాదగయ సెంటర్ వరకు ర్యాలీలో పవన్ పాల్గొనబోతున్నారు.
ఈరోజు మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిర్ణయించుకున్న ముహూర్తంలో నామినేషన్ దాఖలు చెయ్యడానికి పవన్ కళ్యాణ్ సమాయత్తమవుతున్నారు.