Advertisementt

పుష్ప 2 నుంచి మరో స్పెషల్ అప్ డేట్

Mon 22nd Apr 2024 10:42 PM
pushpa 2  పుష్ప 2 నుంచి మరో స్పెషల్ అప్ డేట్
Another special update from Pushpa 2 పుష్ప 2 నుంచి మరో స్పెషల్ అప్ డేట్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీ పుష్ప కి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప ద రూల్ నుంచి అల్లు అర్జున్ బర్త్ డే కి విడుదలైన టీజర్ యూట్యూబ్ లో సన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క డైలాగ్ లేకపోయినా.. పుష్ప 2 టీజర్ ప్రకంపనలు సృష్టించింది. అల్లు ఫాన్స్ టీజర్ లో డైలాగ్ లేకపోవడంతో కాస్త డిస్పాయింట్ అయ్యారు. 

అందుకే ఈసారి సుకుమార్ పుష్ప 2 నుంచి మరో స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తూ పుష్ప ద రూల్ ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతోంది టీమ్. మే మొద‌టి వారంలో పుష్ష 2 నుంచి ఓ పాట రాబోతోందని స‌మాచారం. ప్రమోషన్స్ లో భాగంగా ముందుగా ఓ మాస్ పాట రిలీజ్ చేయ‌బోతున్నారు అని తెలుస్తోంది. 

పుష్ష‌రాజ్ పాత్ర‌ని మ‌రింత డీప్ గా పరిచయం చేసే ఈ గీతాన్ని చంద్ర‌బోస్ రాయగా.. ఈ పాటకి దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు. పుష్ప పార్ట్ 1 లో మ్యూజిక్ ఆల్బమ్ ఎంత హిట్ అయ్యిందో తెలుసుగా.. అందుకే పుష్ప 2 సాంగ్స్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Another special update from Pushpa 2:

Pushpa 2 first single update

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ