నాగ చైతన్య-సమంత ప్రేమ పెళ్లి విడాకుల ఘట్టంతో ముగిసిపోయింది. వారిద్దరూ ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఎవరి పనుల్లో వారు బిజీగా వున్నారు. సమంత తన హెల్త్, తన సినిమా షూటింగ్స్, ఫోటో షూట్స్ అంటూ బిజీగా కనిపిస్తుండగా.. నాగ చైతన్య వెబ్ సీరీస్, సినిమాలంటూ పరుగులు పెడుతున్నాడు. ఇంతలో చైతు సింగిల్ గా లేడు.. హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.
వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళుతున్నారు, గుట్టు చప్పుడు కాకుండా డేటింగ్ లో ఉన్నారంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో కథనాలు చూస్తూనే ఉన్నాము. కానీ వారిద్దరూ డేటింగ్ రూమర్స్ ని ఖండిస్తూనే ఉన్నా.. ఎప్పుడు ఏదో విధంగా వీరి డేటింగ్ విషయంలో అనుమానాలు మొదలవుతూనే ఉన్నాయి.
తాజాగా నాగ చైతన్య ఓ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ పిక్ కి అందరిలాగే శోభిత దూళిపాళ్ల కూడా లైక్ కొట్టింది. కానీ ఇప్పుడదే అనుమానాలకి తావిచ్చింది. నెటిజెన్స్ కి శోభిత దూళిపాళ్ల దొరికిపోయింది, ఎంత గుట్టు చప్పుడు కాకుండా చైతూతో వ్యవహారం నడుపుతున్నా.. ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి కదా అమ్మడు అంటూ శోభితకి సలహాలిస్తున్నారు.