ప్రస్తుతం బాక్సాఫీసు చూస్తే నిస్సారంగా కనిపిస్తుంది. గత రెండు మూడు వారాలుగా ఇంట్రెస్టింగ్ సినిమా ఒక్కటీ కనిపించడం లేదు. వారం వారం చిన్న చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ ఏ ఒక్కటి ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యలేకపోతున్నాయి. టిల్లు స్క్వేర్ తర్వాత ఇప్పటివరకు ప్రేక్షకులు మెచ్చే సినిమా ఏది విడుదల కాలేదు. ఆ లెక్కలోనే ఏప్రిల్ నాలుగో వారంలోను చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. అందులో విశాల్ రత్నం, నారా రోహిత్ ప్రతినిధి 2 చిత్రాలు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి.
అయితే ఈ వారం ఓటీటీలలో కాస్త ఆసక్తికర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటితో పాటుగా యధావిధిగా కొత్త కొత్త వెబ్ సీరీస్ లు విడుదలవుతున్నాయి.
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్ ఫ్లిక్స్ :
డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 25
టిల్లు స్క్వేర్ (తెలుగు) – ఏప్రిల్ 26
అమెజాన్ ప్రైమ్ వీడియో :
దిల్ దోస్తీ డైలమా (హిందీ)- ఏప్రిల్ 25
బుక్ మై షో :
కుంగ్‌ఫూ పాండా 4 (యానిమేషన్) – ఏప్రిల్ 26
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
భీమా (తెలుగు) – ఏప్రిల్ 25
క్రాక్ (హిందీ)- ఏప్రిల్ 26