చందమామ కాజల్ అగర్వాల్ ప్రసుతం సత్యభామ, ఇండియన్ 2 లాంటి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ షూటింగ్ లో బిజీగా కనిపించడమే కాదు.. మధ్య మధ్యలో తన ఫ్యామిలీతో అంటే భర్త గౌతమ్, కొడుకు నీల్ తో సరదాగా గడుపుతూ కనిపిస్తుంది. అంతేకాదు.. అపుడప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే అద్భుతమైన ఫోటో షూట్స్ వదులుతుంది.
తాజాగా #vintagevibes అంటూ కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఫొటోస్ చూస్తే మతిపోతుంది. ఎంత గ్లామర్ గా ఉందొ.. సో బ్యూటిఫుల్ అంటూ కాజల్ అందాలని చూసి కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్. ఆమె అభిమానులైతే కాజల్ కి పెళ్లయినా వన్నె తగ్గలేదు అంటూ సరదాగా మాట్లాడుతున్నారు.
నిజంగానే కాజల్ చాలా అంటే చాలా గ్లామర్ గా అందంగా కనిపించింది. ఈ పిక్స్ చూసాక కాజల్ కి మళ్ళీ ఆఫర్స్ క్యూ కట్టడం గ్యారెంటీ అనేలా ఉంది.