యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుటిన రోజుకి ఇంకా నెల సమయం ఉంది. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే. అప్పుడే ఎన్టీఆర్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని ఎన్టీఆర్ ఫాన్స్ మొదలు పెట్టేసారు. పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు స్పెషల్ గా ఆయన సినిమాల నుంచి రాబోయే అప్ డేట్స్ ఒక ఎత్తు.. మేము ఈ నెల రోజులు చేసే రచ్చ ఒక ఎత్తు అన్నట్టుగా ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ని ఆరాధించడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.
మాస్ అమ్మ మొగుడు అంటూ ఎన్టీఆర్ కటౌట్ పై రాసి మరీ కటౌట్ ని ఓపెన్ చేసి పాలాభిషేకం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. ఆ కటౌట్ ముందు ఎన్టీఆర్ అభిమానులు డాన్స్ లు వేస్తూ, విజిల్స్ వేస్తూ హంగామా చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అది చూసిన నెటిజెన్స్ ఏం మాస్ రా మామ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ బర్త్ డే రోజు పాన్ ఇండియా ఫిలిం దేవర నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరోపక్క ఎన్టీఆర్ హిందీ డెబ్యూ వార్ 2 నుంచి కూడా ఏదొక బిగ్గెస్ట్ అప్ డేట్ రావడం ఖాయమంటూ ఎన్టీఆర్ అభిమానులు క్యూరియాసిటీగా కనిపిస్తున్నారు.