కొద్దిరోజులు కాదు చాలా ఏళ్లుగా ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ లు విడిపోతున్నారు, ఐష్ తన తల్లితో కలిసి కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసివిడిగా ఉంటుంది. అభిషేక్ తో ఐష్ విడాకులు తీసుకోబోతుంది అంటూ చాలానే ప్రచారం జరుగుతుంది. జయాబచ్చన్ తో ఐష్ కే పొసగడం లేదు, అమితాబ్ కూతురు కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అందుకే ఐష్ కి నచ్చకే ఆమె విడిగా ఉంటుంది అంటూ ఏవేవో ఊహాగానాలు, రూమర్స్ కనబడుతూనే ఉన్నాయి.
వాళ్లిద్దరూ కలిసి కనబడితే కొద్ది రోజులు ఆ రూమర్స్ కి చెక్ పెట్టినా.. మళ్ళీ అంతలోనే ఐష్ పై ఈరకమయిన వార్తలు ప్రచారంలోకి రావడంతో అభిమానులు ఆందోళపడుతూ ఉంటారు. తాజాగా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో కలిసి భర్త అభిషేక్ తో దిగిన సెల్ఫీని తమ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా సోషల్ మీడియా ఇన్స్టా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేసింది. ఎంతో చక్కగా బ్యూటిఫుల్ గా కనిపించిన ఐష్ క్యూట్ ఫ్యామిలీ చూసి అందరూ ముచ్చటైన ఫ్యామిలీ అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరికొందరు అభిషేక్ బచ్చన్ తో ఐశ్వర్య విడిపోవడం లేదు.. ఈ పిక్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది. వారు విడిపోవడం అనేది జస్ట్ రూమర్ మాత్రమే అంటూ మాట్లాడుతున్నారు. నిజమే ఇలాంటి ప్రూఫ్ చూసాక అయినా ఐష్-అభిషేక్ విడాకులపై రూమర్స్ ఆగితే బావుంటుందేమో..!