తమిళ, మలయాళ సినిమాల్లో బిజీగా కనబడుతున్న కీర్తి సురేష్ కి టాలీవుడ్ లో కాస్త బ్రేక్ వచ్చింది. నాని దసరా, మహేష్ సర్కారు వారి పాట తర్వాత కీర్తి సురేష్ తెలుగు సినిమా సెట్స్ లో కనిపించడం లేదు. భోళా శంకర్ నిరాశ పరచడంతో కీర్తి సురేష్ కూడా ఎక్కువగా తమిళ చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది.
మలయాళం చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గాఉంటుంది. తన ఫోటో షూట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. తాజాగా కీర్తి సురేష్ కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. అందులో కీర్తి సురేష్ నిజంగా రాజసం ఒలకబోసింది. కాస్ట్లీ కాస్ట్యూమ్స్ లో ట్రెడిషనల్ గా కనిపించి కనువిందు చేసింది.
కీర్తి సురేష్ ని అలా చూసిన నెటిజెన్స్ సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, అందంగా దేవతలా కనిపిస్తున్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.