మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వంకి అనుకూలంగా కనిపిస్తూ చంద్రబాబు, పవన్ లని తిట్టి.. ఆ తర్వాత జనసేనలో చేరుదామని ఆశపడి.. భంగపడి ఇప్పుడు వైసీపీలో చేరిన ముద్రగడ పై 30 ఇయర్స్ పృథ్వీ ఛాలెంజ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చే ముందువరకు టీడీపీ, జనసేనలో ఏ పార్టీలో చేరాలో అని ఊగిసలాడి చివరకు జగన్ పార్టీలో చేరిన ముద్రగడ పద్మనాభం చంద్రబాబు, పవన్ లపై శృతి మించిన విమర్శలు చెయ్యడం చూస్తున్నాం. గత ఐదేళ్లుగా జగన్ పాలన పట్ల అసమ్మతితోనే ఉండి.. చివరికి ఆయన పంచనే చేరారు ముద్రగడ. జగన్ తాయిలాలకు లొంగిపోయి ముద్రగడ ఇలా రెడ్డి సేవకుడిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా టాలీవుడ్ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ముద్రగడ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో వైసీపీలో ఉన్న పృథ్వీ ఆ పార్టీలో తనకు జరిగిన అమానాన్ని తట్టుకోలేక కొన్నాళ్ల క్రితమే బయటికి వచ్చేసి జనసేనలో చేరిన విషయం తెలిసిందే.
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూటమి తరపున పృథ్వీ ప్రచారం చేస్తూ.. వైఎస్ జగన్, అంబటి రాంబాబు, ముద్రగడ పద్మనాభంపై తనదైన శైలిలో ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డిని.. బటన్ రెడ్డి అని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని మంత్రి అంబటి రాంబాబుకు ముందే అర్థమైపోయిందని అన్నారు. మరోవైపు, ముద్రగడ గురించి మాట్లాడుతూ.. కులం ఎప్పుడు కూడా కూడు పెట్టదని ముద్రగడ పద్మనాభంని పృథ్వీ హెచ్చరించాడు. కిర్లంపూడిలో కూర్చొని విద్యుత్ బిల్లులు ఎగ్గొడతాడని ముద్రగడపై ఆరోపణలు గుప్పించారు. ముద్రగడ కాపు నాయకుడు కాదని.. రెడ్డి సేవకుడని పృథ్వీ చేసిన వ్యాఖాయ్లు వైరల్ అయ్యాయి.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ మూడు సీట్లు గెలిస్తే.. ముద్రగడ పద్మనాభం ఇంట్లో తాను పని మనిషిగా చేరతానని పృథీృ ఛాలెంజ్ చేశారు.