ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన మంజుమ్మెల్ బాయ్స్ ఇప్పటికి థియేటర్స్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం సర్ప్రైజింగ్ గా 250 కోట్లకి పైగా వసూలు చెయ్యడంతో పరభాషా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని పలు భాషల్లో డబ్ చేసి విడుదల చెయ్యగా.. మంజుమ్మెల్ బాయ్స్ విడుదలైన ప్రతి భాషలో కోట్లు కొల్లగొట్టింది.
అయితే ఇప్పుడు ఈ మంజుమ్మెల్ బాయ్స్ థియేటర్స్ లో సూపర్ హిట్ అవడంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. డిస్ని ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు మంజుమ్మెల్ బాయ్స్ ని అన్ని భాషల డిజిటల్ హక్కులని దక్కించుకుంది. అయితే ఈ చిత్రాన్ని మే 3 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కానీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు మంజుమ్మెల్ బాయ్స్ చిత్రాన్ని మే 3 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా అధికారికంగా మలయాళంలో మాత్రమే ప్ర కటించారు. మిగతా భాషల్లో జస్ట్ మంజుమ్మెల్ బాయ్స్ కమింగ్ సూన్ అని మాత్రమే చెప్పారు. మరి మే 3 నుంచి మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీలో వీక్షిద్దామనుకున్న ఆడియన్స్ కి డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఇలా ట్విస్ట్ ఇచ్చింది.