అనుపమ పరమేశ్వరన్ కి టిల్లు స్క్వేర్ హిట్ ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా అనే సందేహంలో అనుపమనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్లామర్ రోల్స్ పోషించడం వేరు, బోల్డ్ గా నటించడం వేరు. గ్లామర్ డాల్ లా ప్రొజెక్ట్ అయితే అది వేరే విషయం. అదే బోల్డ్ హీరోయిన్ గా ముద్ర పడితే.. ఇకపై వచ్చే అవకాశాలు అలాంటివే వస్తాయి.. కానీ కొత్తగా ఏమి రావు.
గతంలో పాయల్ రాజ్ ఫుట్ RX 100 హిట్ తర్వాత ఆమెకి అదే రకమైన ఇందు రోల్స్ మాత్రమే వచ్చాయి. మళ్ళీ కోలుకోవడానికి ఆమెకి ఏళ్ళు పట్టింది. మరి అనుపమ పరమేశ్వరన్ ని టిల్లు స్క్వేర్ లో అలా రొమాంటిక్ యాంగిల్ లో చూసిన వారు ఆమెకి అవే పాత్రలుఆఫర్ చేస్తారు అనే డౌట్ ప్రేక్షకులకు కాదు అనుపమలోనే ఉందేమో అంటున్నారు.
టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ కి అవకాశాలు పెద్దగా రావడం లేదు. టిల్లు విడుదలై నెల కాలేదు. అందులోను యంగ్ హీరోల సినిమాలు కూడా కొత్తగా మొదలు కాలేదు. అప్పుడే ఆఫర్స్ రావడం కష్టమే. కానీ అనుపమ ఇకపై ఎలాంటి రోల్స్ ఎంచుకుంటుంది, ఎలాంటి పాత్రలు వస్తాయి అనే విషయంలో ఆమెకే క్లారిటీ లేదు అనే టాక్ బాగా వినిపిస్తోంది.