యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఎన్టీఆర్ ఈమధ్యనే వార్ 2 కి సంబంధించి ఓ షెడ్యూల్ ని ముంబై లో ఫినిష్ చేసి వచ్చాడు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 లో నటిస్తున్నాడు. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వార్ 2కి దర్శకుడు. ఇక దేవర చిత్రంలో ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ జోడి కడుతుంది. మరో మరాఠీ భామ శృతి మరాఠీ ఎన్టీఆర్ కి భార్యగా కనిపించబోతుంది.
అయితే ఇప్పుడు కొరటాల శివ దేవర చిత్రం కోసం ఐటమ్ గర్ల్ ని సెట్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. గతంలో రంగస్థలంలో రామ్ చరణ్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో కనిపించిన పూజ హెగ్డే ని కొరటాల ఎన్టీఆర్ దేవర చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి కాలు కదిపేందుకు ఒప్పించారనే టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం ఫామ్ కోల్పోయిన పూజ హెగ్డే గ్లామర్ పరంగా స్టార్ హీరోల ఛాన్సెస్ తో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేసిన పూజ హెగ్డే ప్రస్తుతం సౌత్ మూవీస్లో కనిపించకపోయినా.. హిందీలో ఒకటి రెండు ప్రాజెక్ట్ ల్లో నటిస్తుంది. ఇప్పుడు ఈ భామకి దేవర స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వస్తే అమ్మడు లక్కీ అనే చెప్పాలి.