బైరెడ్డి.. బైరెడ్డి.. బైరెడ్డి ఎన్నికల ముందు ఇప్పుడీ యువనేత పేరు ఎక్కడ చూసినా మార్మోగుతోంది.! ఎందుకుంటే.. ఈయన రేంజ్, క్రేజ్ అలాంటిది మరి.! వైసీపీతో సిద్ధార్థ్ రెడ్డికి ఎంత అవసరం ఉందో.. అంతకుమించే సిద్ధార్థ్‌తో వైసీపీకి అవసరం ఉంది. ఎందుకు ఏమిటీ అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. నగరి నుంచి పోటీచేస్తున్న మంత్రి రోజా తనకంటే ఎక్కువగా బైరెడ్డినే నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే రోజా తన గెలుపు బాధ్యత బైరెడ్డి చేతిలో పెట్టేశారట. అందుకే ఎన్నికల ప్రచారం మొదలుకుని నామినేషన్ వేసేంత వరకూ నగరికి అన్నీ తానై చూసుకుంటున్నారు యువనేత.
ఇంతకీ పోటీ ఎవరబ్బా!
వాస్తవానికి సొంత పార్టీ నేతలే నగరిలో రోజాపై తిరుగుబావుటా చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పంచాయితీలు జరిగినా అబ్బే స్థానిక నేతలు అస్సలు తగ్గట్లేదు. దీంతో.. రోజా గెలుపు కాస్త టఫ్ అయ్యింది. పైగా రెండుసార్లు వరుసగా గెలిచిన మేడమ్ ఈసారి గెలవడం అతి కష్టమట. అందుకే జగన్ కలుగజేసుకుని రోజాను గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకురావాలని బాధ్యతలు కట్టబెట్టారట జగన్. అందుకే ప్రచారం మొదలుకుని, వ్యూహ రచన.. నామినేషన్ వరకూ అంతా తానై చూసుకుంటున్నారట. అయితే.. నగరిలో మాత్రం సీన్ వేరేగా ఉందట. ఇంతకీ నగరి నుంచి పోటీ చేస్తున్నది రోజానా..? బైరెడ్డినా..? అనే సందేహాలు నియోజకవర్గ ప్రజలకు వస్తున్నాయట.
ఏం జరుగుతుందో..!
బైరెడ్డి క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా రాయలసీమలో అయితే అబ్బో అదో రకం అంతే. తన ప్రసంగం, పంచ్‌లు.. యాసతో యువతను బాగా ఆకట్టుకుంటారు బైరెడ్డి. అందుకే సొంత జిల్లా కర్నూలు, ఇంచార్జ్‌గా ఉన్న నందికొట్కూరును సైతం వదిలేసి జగన్ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించడానికి.. రోజాను గెలిపించుకుని అసెంబ్లీ తీసుకెళ్లడానికి ఈ రేంజ్‌లో బైరెడ్డి కష్టపడుతున్నారట. అయితే.. లోకల్‌గా మాత్రం గట్టిగానే వ్యతిరేకత, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని.. అస్సలు మేడమ్ అందుబాటులో లేదనే టాక్ గట్టిగానే నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో బైరెడ్డి.. రోజాను ఎలా గెలిపిస్తారనేది మిలియన్ డాలర్లు ప్రశ్న. చూశారుగా.. బైరెడ్డినే నమ్ముకున్న రోజాను ముంచుతారా.. లేపుతారా.. అనేది జూన్-04తో తేలిపోనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ..!