మహేష్ బాబు తో రాజమౌళి తెరకెక్కించబోయే SSMB 29 పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అనేది రాజమౌళి-మహేష్ ఎయిర్ పోర్ట్ లో కనిపించినప్పుడు మీడియాలో జరిగిన హడావిడి చూస్తే తెలుస్తుంది. అయితే SSMB 29 అప్ డేట్ కోసం ప్రపచం మొత్తం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు.
తాజాగా ఆయన SSMB 29 పై చిన్నపాటి క్రేజీ అప్ డేట్ అందించారు. ఆయన ఓ ఈవెంట్ లో మట్లాడుతూ.. తనకు SSMB 29 మూవీ స్టోరీ తెలుసునని, ఇటీవల టీమ్ తో కలిసి చర్చల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కాకపోతే సినిమా ఎప్పుడు మొదలవుతుంది, షూటింగ్ కి ఎంత టైమ్ పడుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అనేది కేవలం రాజమౌళి చేతుల్లొనేవుంది అంటూ ఆయన సైలెంట్ గా సైడయ్యారు.
మహేష్-రాజమౌళి చిత్రం పై ఎంతో కేర్ తీసుకుని రాజమౌళి కష్టపడుతున్నారు, పక్కాగా ఈ చిత్రం గురించి అన్ని విషయాలు టీమ్ వెల్లడించేవరకు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని అంటూ ఆయన స్పష్టం చేసారు.