Advertisementt

మరో క్రేజీ తమిళ్ ప్రాజెక్టులోకి నాగ్

Sun 21st Apr 2024 12:07 PM
nagarjuna  మరో క్రేజీ తమిళ్ ప్రాజెక్టులోకి నాగ్
Nagarjuna in another crazy Tamil project మరో క్రేజీ తమిళ్ ప్రాజెక్టులోకి నాగ్
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున నా సామీ రంగ హిట్ తర్వాత తెలుగులో ఇంకో ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యలేదు. ఆయన ఏ దర్శకుడితో తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈలోపు నాగార్జున క్రేజీ మల్టీస్టారర్ కుబేర షూటింగ్ కి హాజరవుతున్నారు. శేఖర్ కమ్ముల-ధనుష్ కలయికలో తెరకెక్కుతున్న కుబేర చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే సోలో హీరోగానే కాదు.. ఆయన బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ కూడా నటించడానికి ఓకె చెబుతూ ఉంటారు. గతంలో ఆయన బ్రహ్మాస్త్ర మూవీలో కనిపించారు. ఇప్పుడు కుబేరలో నటిస్తున్నారు. తాజాగా నాగార్జున మరో స్టార్ హీరో ప్రాజెక్ట్ కి ఓకె చెప్పారని న్యూస్ హైలెట్ అయ్యింది. సౌత్ ఇండియా కేజ్రీ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ల సినిమాలో నాగార్జున కూడా నటించబోతున్నారట.

రజినీకాంత్ చిత్రం లో కింగ్ నాగ్ ఓ స్పెషల్ రోల్ లో సందడి చేయనున్నారని.. ఇప్పటికే నాగార్జున ఈ ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారనే టాక్ మొదలైంది. 

Nagarjuna in another crazy Tamil project:

Nagarjuna is going to act in Rajinikanth and Lokesh Kanagaraj film

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ