Advertisementt

మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కన్ఫర్మ్

Sun 21st Apr 2024 09:32 AM
manjummel boys  మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కన్ఫర్మ్
Manjummel Boys OTT Streaming Confirm మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కన్ఫర్మ్
Advertisement
Ads by CJ

మలయాళంలో 2006లో కొడైకెనాల్ లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ మల్లువుడ్ లో 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. కేవలం 20 కోట్లతో తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ ని మలయాళీలు విపరీతంగా ఆదరించారు. అదే మంజుమ్మెల్ బాయ్స్ ని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చెయ్యగా.. ఈ చిత్రం విడుదలైన ప్రతి భాషలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

థియేటర్స్ లో హిట్ అయిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. ఏ ప్లాట్ ఫారమ్ నుంచి స్ట్రీమింగ్ అవుతుందా అని ఓటీటీ ఆడియన్స్ తెగ వెతికేస్తున్నారు. అయితే మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులని ఫ్యాన్సీ రేటుకి డిస్ని ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది.

డిస్ని ప్లస్ హాట్ స్టార్ వారు మంజుమ్మెల్ బాయ్స్ ని మే 3నుంచి మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ భాషల ఓటీటీ ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. 

Manjummel Boys OTT Streaming Confirm:

Manjummel Boys OTT streaming details

Tags:   MANJUMMEL BOYS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ