ఎంతటి శత్రువైనా సరే సమయం, సందర్భం వస్తే ఒక్కటవుతారు.! లేని పక్షంలో కనీసం పలకరింపు అయినా ఉంటుంది.! కఠినాత్ముడైనా సరే.. శుభకార్యాలకు హాజరుకాలేకపోయినా.. కనీసం విషెస్ అయినా చెబుతాడు.! కానీ ఈ రెండింటికి మించిన వ్యక్తి ఒకరున్నారబ్బా..! ఇదంతా ఎవరి గురించో కాదండోయ్ చెప్పేది.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించే..! ఏప్రిల్-20న టీడీపీ అధినేత నారా చంద్రబాబు పుట్టిన రోజు. సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీలు, ప్రముఖులు, రాజకీయ నేతల వరకూ ఫోన్లు చేయడం.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి.. ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. అయితే జగన్ మాత్రం కనీసం ఒక్క ట్వీట్ చేయడానికి కానీ.. ఫోన్ చేసి విష్ చేయడానికి కూడా సాహసించలేదు. ఈ విషయం తెలుసుకుని సొంత పార్టీ నేతలే ఛీ కొడుతూ.. చీదరించుకుంటున్న పరిస్థితి.
ఇంత దారుణమా..?
వైఎస్ జగన్ పుట్టిన రోజు తప్పకుండా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు విష్ చేస్తూ వచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. రాజకీయాలు చేయకుండా జగన్‌కు సంబంధించిన ప్రతి విషయంలోనూ స్పందిస్తూ వచ్చారు. ఆఖరికి మొన్న రాయి దాడి విషయంలోనూ ట్విట్టర్ వేదికగా రియాక్టయ్యి.. నిందితులెవరైనా సరే కఠినంగా శిక్షించాలని ఎన్నికల కమిషన్‌కు కూడా కోరారు చంద్రబాబు. ఇదొక్కటే కాదు సందర్భం ఏదైనా సరే ఎంతటి శత్రువులైనా సరే పలకరించడం.. విష్ చేయడం చేస్తూ వస్తున్నప్పటికీ జగన్ మాత్రం ఎందుకో ఈ విషయంలో కఠినంగా ప్రవర్తిస్తుండటం గమనార్హం. జగన్ మరీ ఇంత దారుణంగా ఉంటారనే విషయం ఇప్పుడిప్పుడే తెలిసొచ్చింది అని కొందరు అనుకుంటే.. నిజ స్వరూపం బయటపడిందని మరికొందరు చెబుతున్నారు.
టూ మచ్ జగన్..!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నది జగమెరిగిన సత్యమే. కానీ.. జగన్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ.. చంద్రబాబును శత్రువుగానే చూస్తున్నారు.. అంతేకాదండోయ్ శాశ్వత శత్రువుగానే చూస్తున్నట్లే ఉంది. ఇదే జగన్‌కు నాడు కోడి కత్తి.. నేడు రాయితో దాడి జరిగితే ఎన్డీఏ లీడర్లు చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ స్పందించిన రోజులు ఎందుకో మరిచిపోయారు. పోనీ.. చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పినంత మాత్రాన జగన్‌కు పోయేదేమైనా ఉందా అంటే అబ్బే ఏమీ లేదే. మరీ ఎందుకు విష్ చేయలేదో జగన్ విజ్ఞతకే వదిలేయాలి మరి. జగన్ ఎందుకింతలా అభద్రతా భావంతో ఉన్నారు..? చంద్రబాబు శత్రువే అనుకో కనీసం వయసు, అనుభవానికి.. అయినా గౌరవం ఇవ్వాలి కదా అనే విమర్శలు జగన్‌పై సర్వత్రా వస్తున్నాయి.