పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD నుంచి బిగ్ అప్ డేట్ రాబోతుంది.. అది కూడా రేపు ఆదివారమే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా, దిశా పటాని లు కలిసి నటిస్తున్న కల్కి చిత్రం కొత్త రిలీజ్ డేట్ పై అందరిలో తీవ్ర ఉత్కంఠ నడుస్తుంది. మే 9నుంచి కల్కి పోస్ట్ పోన్ అవడం గ్యారెంటీ.. కానీ కొత్త డేట్ పై మాత్రం సస్పెన్స్ వీడడం లేదు. దాంతో ప్రభాస్ ఫాన్స్ ఎదురు చూపులు ఎక్కువవుతున్నాయి.
మరోపక్క కల్కి సీజీ వర్క్ కంప్లీట్ అవ్వలేదు అని కొందరు, డిస్ట్రిబ్యూటర్స్ తో కల్కి మేకర్స్ పై ఒత్తిడి పెరిగిపోతుంది అని మరికొందరు అంటుంటే ఫాన్స్ ఆందోళన మరింత ఎక్కువైంది. ఇక కొత్త విడుదల తేదీ మే 30 కానీ.. లేదంటే జూన్ 20 కానీ ఉంటుంది అంటున్నారు.
అది ఎప్పడు అనేది రేపు ఆదివారం ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వబోతున్నారు. 𝐓𝐡𝐞 𝐭𝐢𝐦𝐞 𝐡𝐚𝐬 𝐜𝐨𝐦𝐞 𝐭𝐨 𝐤𝐧𝐨𝐰 𝐰𝐡𝐨 𝐡𝐞 𝐢𝐬!. సమయమొచ్చింది అంటూ కల్కి మేకర్స్ హుషారుగా అప్ డేట్ ఇచ్చారు. రేపు ఆదివారం సాయంత్రం 7.15 నిమిషాలకి కల్కి నుంచి బిగ్ అప్ డేట్ కోసం సిద్దమైపొండి.