మెగా కోడలు సురేఖ ఆమె కోడలు ఉపాసన మద్యన చాలా ముచ్చటైన అనుబంధం కనిపిస్తుంది. అంతేకాదు మెగాస్టార్ వైఫ్ సురేఖ మెగాస్టార్ తల్లి అంజనాదేవి గారితోను మంచి అనుబంధాన్ని మైంటైన్ చేస్తారు. ఈమధ్యనే మెగాస్టార్ వైఫ్ సురేఖ అత్తమ్మ కిచెన్ అంటూ బిజినెస్ మొదలు పెట్టారు. ఉపాసన అత్తమ్మ కిచెన్ బిజినెస్ ని సురేఖ గారు మొదలు పెట్టినట్లుగా రివీల్ చేసారు.
అందులో భాగంగా సురేఖ గారు మామిడికాయ పచ్చడి అదేనండి ఆవకాయ్ పచ్చడి పెడుతున్నారు. ఉపాసన ఆ పచ్చడి కలుపుతున్న వీడియో చేస్తూ రామ్ చరణ్ నానమ్మ గారి దగ్గరకి వెళ్లి నానమ్మ ఎందుకింత సీరీస్ గా ఉన్నారు అనగానే ఆమె పనేం చెయ్యలేక కూర్చున్నాను అందుకే ఇలా అంటూ చెప్పడంతో మీ కోడలు మీకు సరిగ్గా టిఫిన్ చేసి పెట్టడం లేదా అంటూ ఉపాసన ఆటపట్టించింది.
ఆ తర్వాత సురేఖ గారు ఆవకాయ్ కలుపుతున్నప్పుడు ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నావ్ అని అడగకు అంటూ సురేఖ ఉపాసనతో చెప్పడంతో.. ఉపాసన సరదాగా అక్కడికి వచ్చిన సురేఖ అక్క ని హాయ్ ఆంటీ అంటూనే వెల్ కమ్ అత్తమ్మ కిచెన్ అంటూ చెప్పిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసిన నెటిజెన్స్ అత్తాకోడళ్ల ముచ్చట్లు అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.