రాజమౌళి కెరీర్ లో రవితేజ కేరీర్లో విక్రమార్కుడు ఓ మెమొరబుల్ మూవీ. రవితేజ ని తిరుగులేని స్టార్ ని చేసిన విక్రమార్కుడు చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని రాజమౌళి పదేళ్ల క్రితమే చెప్పారు. దానితో ఆ ఘట్టం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అటు కథా రచయిత విజయేంద్రప్రసాద్ గారు అప్పుడప్పుడు విక్రమార్కుడు 2 పై అంచనాలు పెంచుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా విక్రమార్కుడు సీక్వెల్ కి కథ రెడీనే అంటూ మరోసారు ఊరించారు నిర్మాత రాధామోహన్.
విక్రమార్కుడు నిర్మాత రాధామోహన్ మరోసారి విక్రమార్కుడు సీక్వెల్ పై ఓ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. విజయేంద్ర ప్రసాద్ గారు విక్రమార్కుడు 2 కి కథని రెడీ చేసారు.. తెలుగులో విక్రమార్కుడు 2, హిందీలో రౌడీ రాధోడ్ 2 గా ఉండబోతుంది. అంతేకాదు ఆయన సల్మాన్ ఖాన్ కోసం భజరంగి భాయీజాన్ సీక్వెల్ కథని కూడా సిద్ధం చేసి సల్మాన్ కి వినిపించే పనిలో ఉన్నారని చెప్పారు.
మరి రాధామోహన్ గతంలో విక్రమార్కుడు 2 గురించి అప్ డేట్ ఇచ్చారు. కానీ అందులో హీరో రవితేజ అని కానీ.. దర్శకుడు రాజమౌళి అని కాని ఎక్కడా మెన్షన్ చేయకపోవడమే.. కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. మరి విక్రమార్కుడు హీరో, డైరెక్టర్ ఎవరు అనేది ఎప్పడు రివీ చేస్తారో చూడాలి.