ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఎక్కువ తక్కువ మాట్లాడినా, లేదంటే ఏదైనా అసాంఘిక ఘటనలకు పాల్పడినా ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. రీసెంట్ గానే టీడీపీ, జనసేన, షర్మిల వాళ్ళకి వివేకా మర్డర్ కేసు పై మాట్లాడొద్దు అని ఏపీ హై కోర్టు ఆర్డర్ వేసింది. దానితో వైసీపీ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే అవినాష్, జగన్ లపై షర్మిల, సునీత, చంద్రబాబు లు వివేకా మర్డర్ కేసుపై మట్లాడడం వైసీపీ కి మింగుడు పడడం లేదు. కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇక సీఎం స్థానంలో జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చెయ్యడం, పెళ్లిళ్లపై పదే పదే చీప్ కామెంట్స్ చేయడంపై జనసేన నేతలు జగన్ పై ఈసీకి కంప్లైట్ చెయ్యడం హాట్ టాపిక్ కాదు దానిపై వైసీపీ నేతలు చిల్లర కామెంట్స్ చేస్తున్నారు. తమ అధినేతపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నప్పటికీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ పేలుళ్లపై కానీ, ఆయన భార్యలపై కానీ జగన్ నేరుగా కామెంట్స్ చెయ్యడం లేదు.. దత్తపుత్రా, ప్యాకేజి స్టార్ అంటూ సంభోదిస్తున్నారు.. పవన్ పేరెత్తకపోయినా జనసైనికులు పవన్ నే జగన్ అంటున్నారు అందుకే జగన్ పై ఈసీకి కంప్లైంట్ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు.. ఇది విడ్డురం అంటూ వైసీపీ అనుకూల బ్లూ మీడియా రాతలు రాయడం గమనార్హం.
తమ గురించి మాట్లాడితే తప్పు కానీ.. తాము ఎవరి గురించి మాట్లాడినా తప్పు లేదు అని జగన్ అనుకుంటున్నట్టుగా ఉన్నారు. వైసీపీ నేతలు కొడాలి నాని, రోజా, పేర్ని నాని లాంటి వాళ్లు నీచమైన మాటలు మాట్లాడినా తప్పు లేదు, కానీ ఎవరైనా జగన్ గురించి వైసీపీ నేతలు గురించి కామెంట్స్ చేస్తే తప్పా.. అంటూ జనసైనికులు జగన్ ని నిలదీస్తున్నారు.