నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం హిందూపూర్ నియోజక వర్గంలో పొలిటికల్ ప్రచారంలో హుషారుగా కనిపిస్తున్నారు. నిన్న శుక్రవారం బలకృష్ణ ఎమ్యెల్యేగా పోటీ చేసేందుకు హిందూపూర్ లో నామినేషన్ వేశారు. అయితే బాలయ్య బాబీ దర్శకతంలో నటిస్తున్న NBK 109 చిత్రం టైటిల్ పై నందమూరి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఉగాదికి వీర అనే టైటిల్ వదులుతున్నారు అంటూ ఆ టైటిల్ వాడుకలోకి వచ్చింది.
కానీ మేకర్స్ ఉగాది ని లైట్ తీసుకున్నారు. ఇక బాలయ్య బర్త్ డే అంటే జూన్ 10 వరకు బాబీ సినిమా నుంచి ఎలాటి అప్ డేట్ రాదని తెలుస్తోంది. బాలయ్య కూడా ఎలక్షన్స్ మూడ్ లో ఉన్నారు. అయితే బాలయ్య-బాబీ NBK 109ని దసరా కానీ లేదంటే అఖండ కి కలిసొచ్చిన డిసెంబర్ లో కానీ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం చాలావరకు షూటింగ్ కంప్లీట్ అయినా బాలయ్య జూన్ వరకు అందుబాటులో ఉండరు కాబట్టి ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేసేందుకు టైమ్ సరిపోకపోతే.. డిసెంబర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రిపేర్ అవుతారట.
జూన్ 10నే ఈ చిత్ర టైటిల్ తో పాటుగా డేట్ కూడా లాక్ చేస్తారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలవుతుంది.. 2025 సంక్రాంతి వరకు అభిమానులని వెయిట్ చేయించరు అని ఫాన్స్ నమ్ముతున్నారు. మరి మేకర్స్ నిర్ణయం ఎలా ఉందొ చూడాలి.