Advertisementt

జగన్ కి షాకిచ్చిన కాకినాడ స్టూడెంట్స్

Fri 19th Apr 2024 08:54 PM
jagan  జగన్ కి షాకిచ్చిన కాకినాడ స్టూడెంట్స్
Kakinada students shocked Jagan జగన్ కి షాకిచ్చిన కాకినాడ స్టూడెంట్స్
Advertisement
Ads by CJ

సీఎం జగన్ మనమంతా సిద్సమే బస్సు యాత్రలో భాగంగా ఏపీలో పలు నియోజక వర్గాల్లో పర్యటిస్తూ తాను నిలబెట్టిన అభ్యర్థులకు ఓట్లు వెయ్యమని అడుగుతున్నారు. అందులో భాగంగా బస్సు యాత్రకి వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారని వైసీపీ వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటుంటే.. ప్రతి పక్ష పార్టీలు, జగన్ యాంటీ ఫాన్స్ మాత్రం అదంతా సీజీ వర్క్ లో చేసి జనాలని చూపిస్తున్నారు. గతంలో సిద్ధం సభలను ఇలాంటి సీజీ వర్క్ తో కవర్ చేసిన జగన్ టీమ్ ఇప్పుడు కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నారంటూ కామెడీ చేస్తున్నారు. 

తాజాగా జగన్ కాకినాడలో పర్యటిస్తున్న సమయంలో ఆదిత్య కాలేజ్ లోని కొంతమంది స్టూడెంట్స్ బస్సు దగ్గరకి పెరిగెత్తుతున్నట్టుగా వీడియోస్ వదిలారు వైసీపీ వాళ్ళు. కానీ అందులోని ఓ స్టూడెంట్ వీళ్లంతా జగన్ కోసం వచ్చినోళ్ళు కాదు వాళ్ళకి హాజరు వెయ్యమని భయపెట్టి జగన్ బస్సు దగ్గరకి తీసుకొచ్చారంటూ వీడియో వదిలాడు. 

అదే వీడియో లో ఆ స్టూడెంట్స్ జగన్ బాస్ వెళుతుండగా.. బాబులకు బాబు కళ్యాణ్ బాబు, బాబులకు బాబు కళ్యాణ్ బాబు.. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ రచ్చ రచ్చ చేసారు. సీఎం గో బ్యాక్ అంటూ హంగామా చేస్తుండగా.. జగన్ బస్సుని ఆపకుండా వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Kakinada students shocked Jagan:

Kakinada College Student Big Shock To Jagan

Tags:   JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ