ఈరోజు ఏప్రిల్ 19 తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ పుట్టిన రోజు. పుటిన రోజునాడు సోషల్ మీడియా వేదికగా పలువురు పదహారణాల తెలుగమ్మాయి ఈషా రెబ్బాకి విషెస్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు. స్నేహితులు, సన్నిహితులు, ఇండస్ట్రీ పీపుల్ అందరూ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే తన బర్త్ డే రోజున తానెలా గడుపుతుందో కానీ అంటే ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటుందా లేదంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుందో అనేది తెలియదు కానీ..
ఈరోజు ఈషా రెబ్బ అందమైన రెండు ఫొటోస్ ని షేర్ చేసింది. చక్కని చీర కట్టులో ముద్దబంతిలా మెరిసిపోయింది. రెడ్ కలర్ సారీ లో ఫుల్ హ్యాండ్ బ్లాక్ హ్యాండ్ లూమ్ బ్లౌజ్ లో ఈషా రెబ్బ నిజమైన తెలుగు బ్యూటీలా దర్శనమిచ్చింది. ఆ పిక్స్ చూడగానే ముద్దబంతిలా ముచ్చటగా ఉన్న ఈషా రెబ్బ అంటూ నెటిజెన్స్ తో పాటుగా ఆమె అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.