దర్శకధీరుడు రాజమౌళి-మహేష్ బాబు కలిసి కనిపించే క్షణం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. మహేష్ అభిమానులైతే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఉన్నారు. ఆ క్షణం వచ్చేసింది. రాజమౌళి-మహేష్ బాబు కలిసి ఒకేసారి ఒకేచోట కనిపించారు. ఇద్దరూ కలిసి దుబాయ్ నుంచి ఫ్లైట్ లో ప్రయాణం చెయ్యడమే కాదు.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఒక్కసారిగా SSMB 29 హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఫారెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్ గా తెరకెక్కబోయే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తవగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి స్విజర్లాండ్ వెళ్లిన మహేష్ బాబు.. రాజమౌళిని మీటయ్యేందుకు దుబాయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. SSMB 29 నిర్మాతతో కలిసి SSMB 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం మహేష్-రాజమౌళి దుబాయ్ వెళ్లినట్లు చెబుతున్నారు. తాజాగా పిక్స్ లో మహేష్ బాబు లుక్ మాత్రం అదిరిపోయింది. SSMB 29 కోసం మహేష్ తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. గుబురు గడ్డంతో, జులపాల జుట్టుతో మెలితిప్పిన మీసంతో మహేష్ లుక్ సూపర్ ఉంది అంటూ మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా అనౌన్స్ చేశాక మొదటిసారి రాజమౌళి - మహేష్ బాబు కలిసి కనిపించారు. ఈరోజు ఉదయం రాజమౌళి- మహేష్ ఇద్దరూ కలిసి దుబాయ్ నుంచి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు వస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఏ క్షణమైనా SSMB 29 పై అప్ డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.