Advertisementt

ప్రభాస్ రాజా సాబ్ పై నో కామెంట్స్

Thu 18th Apr 2024 10:16 PM
the raja saab  ప్రభాస్ రాజా సాబ్ పై నో కామెంట్స్
No Comments on Prabhas Raja Saab ప్రభాస్ రాజా సాబ్ పై నో కామెంట్స్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ షూటింగ్ పై కానీ, రాజా సాబ్ రిలీజ్ డేట్ పై కానీ అప్ డేట్స్ ఇచ్చేందుకు నిర్మాత రెడీగా లేరు. ప్రభాస్ తో మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ షూటింగ్ ప్రభాస్ డేట్స్ ఇచ్చినప్పడు ఫుల్ స్వింగ్ లోనే చుట్టేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్-నిధి అగర్వాల్ పై ఓ పాటని మారుతి చిత్రీకరిస్తున్నారనే అప్ డేట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మీడియా మీట్లో భాగంగా మీడియా వారు ప్రభాస్ రాజ్ సాబ్ అప్ డేట్స్ పై ప్రశ్నలు సంధించారు. కానీ విశ్వప్రసాద్ మాత్రం రాజా సాబ్ పై మాట్లాడేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ దాని నుంచి రాబోయే ఫస్ట్ సింగిల్ గురించి అడిగితే.. అవన్నీ ప్రభాస్ నటిస్తున్న కల్కి (ప్రాజెక్ట్ K ) రిలీజ్ తర్వాతే అంటూ సింపుల్ గా చెప్పేసారు. 

మారుతి-ప్రభాస్ కాంబో రాజా సాబ్ సంక్రాంతి రిలీజ్ అంటున్నారు. షూటింగ్ 60 పర్సెంట్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నాము, అసలు రాజా సాబ్ పై మీరేం చెబుతారు అని అడిగితే.. అవి ఇప్పుడే కాదండీ.. కాస్త సమయముంది, కల్కి విడుదలవ్వనివ్వండి, అప్పుడు మొదలు పెడదాం అంటూ రాజా సాబ్ పై నో కామెంట్స్ అంటూ తేల్చేసారు ఆయన. దానితో ప్రభాస్ అభిమానులు డిస్పాయింట్ అవుతున్నారు. 

No Comments on Prabhas Raja Saab:

Producer TG Vishwa Prasad About The Raja Saab Movie 

Tags:   THE RAJA SAAB
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ