Advertisementt

వైఎస్ జగన్‌ను చంపడానికే దాడి!

Thu 18th Apr 2024 09:32 PM
jagan  వైఎస్ జగన్‌ను చంపడానికే దాడి!
Attack to kill YS Jagan! వైఎస్ జగన్‌ను చంపడానికే దాడి!
Advertisement

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. నిన్న, మొన్న షాకింగ్ విషయాలే బయటికి రాగా.. మూడో కంటికి తెలియకుండా.. చలీ చప్పుడు చేయకుండానే ఈ దాడి కేసులో నిందితులను అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేయడం.. కోర్టులో కూడా హాజరుపరచడం అంతా చకచకా జరిగిపోయింది. ఇంతవరకూ ఓకేగానీ.. దాడి చేసిన యువకుడు సతీష్ రిమాండ్ రిపోర్టులో విషయాలను చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్న వైసీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి.

ఇదీ అసలు సంగతి!

దాడి కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఇద్దరి (Lw8, Lw9) సమాచారంతో నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు.. ఘటనకు ముందు ఆ తర్వాత ఎవరెవరితో నిందితుడు ఫోన్ కాల్ చేసి మాట్లాడాడు..? నిందితుడి కదలికలను స్పాట్‌లో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాక్షులను వచ్చిన సమాచారం మేరకు ఆధారాలు సేకరించి నిందితుడిని ఈనెల 17న రాజరాజేశ్వరీ పేటలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అనంతరం మొదట మొబైల్ ఫోన్ సీజ్ చేశామని.. నిందితుడు A2 ప్రోద్భలంతోనే కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు పోలీసులు రిపోర్టులో తెలిపారు. వైఎస్ జగన్ రెడ్డిని హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశారని.. దాడి వెనుక చంపాలనే ఉద్దేశం ఉందని క్లియర్ కట్‌గా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. సీసీ ఫుటేజీలు, వీడియోగ్రాఫ్ కూడా సేకరించి పరిశీలించామని.. అందుకే విజయవాడ సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన వేమలుల సతీష్‌ను అరెస్ట్ చేశామన్నారు.

అవును కుట్రే!

అన్ని సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన తర్వాతే ఏ-1గా మైనర్, ఏ-2గా దుర్గారావు పేర్లను చేర్చినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా పోలీసులు మీడియాకు వెల్లడించారు. అంతమొందించాలనే కుట్రలో భాగంగానే సున్నితమైన తల భాగంలో దాడి చేశారని.. రాత్రి 08:04 నిమిషాలకు బస్సు యాత్రలో వివేకానంద స్కూల్ దగ్గర జనంతో కలిసిపోయి నిందితుడు దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇలా దాడి చేయడానికి సింగ్ నగర్‌ ఫ్లై ఓవర్‌ పైనుంచి సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసుకొచ్చాడని.. ఇదంతా జగన్‌ను హత్య చేయాలనే ఉద్దేశ్యంతోనే జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా వివరించారు. ఇదిలా ఉంటే.. జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌కు 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధించింది. చూశారుగా.. నిన్న మొన్నటి వరకూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏ రేంజులో మాటల యుద్ధం జరిగిందో.. చివరికి ఎక్కడికొచ్చి ఆగిందో.. మున్ముందు ఇంకెన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాలి మరి.

Attack to kill YS Jagan!:

The attack on Jagan is a conspiracy!

Tags:   JAGAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement