యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబై లో ఉన్నారు. అక్కడ హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 షూటింగ్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ గత గురువారం ముంబై బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత శుక్రవారమే ఆయన వార్ 2 సెట్స్ లోకి అడుగుపెట్టారు. ముంబై వెళ్ళాక ఎన్టీఆర్ తో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేల్ల జిమ్ లో సెల్ఫీ దిగి ఎన్టీఆర్ ని పొగుడుతూ పోస్ట్ చేసింది.
అలాగే రెండు రోజుల క్రితం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లు వారు షూటింగ్ కి హాజరవుతున్న సమయంలో ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 లుక్స్ లీక్ అంటూ ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసారు. తాజాగా ఎన్టీఆర్ జిమ్ ట్రైనర్ తో ఫోటో దిగగా దానిని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి మొదలు పెట్టారు.
అసలే దేవర ఇప్పుడు ముంబై లో అది కూడా హిందీ ప్రాజెక్ట్ లో చేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ ఫాన్స్ పట్టరాని ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇలా ఎన్టీఆర్ పిక్ ఏదైనా బయటికొస్తే చాలు దానిని ట్రెండ్ చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు.