పుష్ప ద రైజ్ తో ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా మార్కెట్ లో కలెక్షన్స్ వర్షం కురిపించారు అల్లు అర్జున్-సుకుమార్ లు. ప్రతి భాషలోనూ కేవలం ఒక్క ప్రెస్ మీట్ తోనే పుష్ప పై అంచనాలు పెంచిన అల్లు అర్జున్.. సినిమా విడుదలయ్యాకా ఆ అంచనాలు కలెక్షన్స్ రూపంలో కళ్ళు చెదిరేలా చేసాడు. హిందీలో అయితే ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టిన పుష్ప మీద నార్త్ ఆడియన్స్ వల్లమాలిన ప్రేమ చూపించడంతో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు చేతికి వచ్చి పడింది.
ఇక ఇప్పుడు పుష్ప ద రూల్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఊహించడానికి కూడా కష్టమనేలా ఉంది వ్యవహారం. సుకుమార్-అల్లు అర్జున్ పుష్ప ద రూల్ తో ఆగష్టు 15 న జాతరకు రెడీ అవుతున్నారు. అప్పుడే పుష్ప ద రూల్ బిజినెస్ పై పర భాషా నిర్మాణ సంస్థలు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా హిందీ మర్కెట్ విషయంలో అక్కడి బడా నిర్మాణ సంస్థలు పుష్ప మేకర్స్ ని కలిసి చర్చలు మొదలైపోయాయంటున్నారు.
అనిల్ తదాని పుష్ప హిందీ హక్కులను 200 కోట్లకు అడ్వాన్స్ బేసిస్ మీద కొన్నాడనే వార్త బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వైరల్ అయ్యి కూర్చుంది. అది నిజమైతే గనక పుష్ప గాడి రూల్ రికార్డుల వేట మొదలు పెట్టినట్లే. ఒక తెలుగు డబ్బింగ్ మూవీకి నార్త్ లో ఇంత క్రేజ్ ఉండడం అది కూడా 200 కోట్లకి ఉండడం మాములు విషయం కాదని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ లెక్కన మొత్తం బిజినెస్ చూస్తే కళ్ళు తిరగడం ఖాయంగా అనిపించడం లేదూ!
ఇప్పటివరకు ప్రమోషన్స్ లేవు, ఇంకా ఎక్కడా థియేట్రీకల్ బిజినెస్ మొదలు కాలేదు.. కానీ ఈలోపే హిందీ మర్కెట్ లో పుష్ప 2 కి ఆ రేంజ్ లో కొటిషన్ వినిపించడం అంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్ కాక ఇంకేమవుతుంది అంటూ అల్లు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.