చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అంటూ నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే పాడాలనిపించే పాట. సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉండే రష్మిక తన ఫోటొస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. గ్లామర్ ఫోటో షూట్స్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు శారీ లుక్స్ ని, జిమ్ వీడియోస్, వర్కౌట్స్ పిక్స్ ని షేర్ చేస్తుంది.
తాజాగా రష్మిక బ్లాక్ మోడ్రెన్ డ్రెస్ లో లూజ్ హెయిర్ తో కనిపించి కనువిందు చేసింది. అంతేకాదు తన చురకత్తుల్లాంటి చూపులతో చంపేసింది. అందుకే యూత్ మొత్తం చూపులతో గుచ్చి గుచ్చి చంపకే.. అంటూ ఇడియట్ సాంగ్ వేసుకుంటున్నారు. ఆమె అభినులైతే రష్మిక లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ లు లైక్ లతో హోరెత్తిస్తున్నారు.
ఇక రష్మిక మందన్న ప్రస్తుతం రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అలాగే పుష్ప ద రూల్ పాన్ ఇండియా ఫిలిం షూటింగ్ తో పాటుగా ధనుష్ కుబేర మూవీలో నటిస్తూ బిజీగా కనిపిస్తుంది.