కొద్దిరోజులుగా సమంతలో చాలా మార్పొచ్చింది. ఆమె నటనకు రీ ఎంట్రీ ఇస్తాను అని చెప్పక ముందు నుంచే అధికంగా గ్లామర్ షో చెయ్యడం స్టార్ట్ చేసింది. ఒకప్పటి గ్లామర్ డాల్ సమంతకి ఇప్పుడు సమంతకి చాలా మార్పు ఉంది. హిందీ టార్గెట్ గానే ఆమె ఇలా మారింది అని చెప్పుకుంటున్నారు. రోజు రోజుకి గ్లామర్ షో లో ఇంకో మెట్టు ఎక్కుతుంది కానీ దిగడం లేదు. కొంతమందికి సమంత గ్లామర్ కనువిందు చేస్తుంది.
మరికొంతమంది మాత్రమ్ సమంత పై ఉన్న గౌరవం పోతుంది అని మాట్లాడుతున్నారు. మరి సమంత ఎవ్వరి కోసము మారే రకం కాదు. తనని ట్రోల్ చేసే వారికి ఇచ్చి పడేసే రకం. అయితే ఈమధ్యన టూ మచ్ గ్లామర్ షో తో హైలెట్ అవుతున్న సమంత ఉన్నట్టుండి చక్కని చుక్కలా మారిపోయింది. ఒంటి నిండా బట్టలు వేసుకుని షాకిచ్చింది.
షార్ట్ మిడ్డీ టైప్ వేసుకున్నా.. పైన మాత్రం ఫుల్ గా కోట్ కి బటన్స్ పెట్టుకుని పద్దతి గా కనిపించింది. అది చూసిన నెటిజెన్స్ ఏంటి సమంతలో సడన్ గా ఇంత చేంజ్, ఏంటి సమంతా ఇంత ట్విస్ట్ ఇచ్చావ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి సమంత కొత్త ఫోటోషూట్ ని మీరూ ఓ లుక్కెయ్యండి.