జబర్దస్త్ అంటే పెద్ద కామెడీ షో, అక్కడ పేరుకి పేరు, డబ్బుకి డబ్బు వస్తుంది.. లైఫ్ లో సెటిల్ అవడమే కాదు.. వెండితెర మీద కూడా వెలిగిపోవచ్చనే ఆశలపై చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ నీళ్లు చల్లుతున్నారు. గతంలో వేణు, ధనరాజ్, చమ్మక్ చంద్ర, సుధీర్, ఆది లాంటి వాళ్ళు ఉన్నప్పుడు పేరుకి పేరు, డబ్బుకి డబ్బు వచ్చేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేసిన కమెడియన్స్ తో పాటుగా.. అందులో ఇంకా కొనసాగుతున్న కమెడియన్స్ చేస్తున్న కామెంట్స్ చూస్తే తెలుస్తుంది.
జబర్దస్త్ లో ఫేమస్ అవుదామని కలలు కనీ ఉద్యోగం కూడా మానుకుని కామెడీ చెయ్యడానికి వచ్చిన నూకరాజు ప్రస్తుతం జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా అతనొక ఇంటర్వ్యూలో మట్లాడుతూ జబర్దస్త్ లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, టీమ్ లీడర్లుగా ఉన్న వాళ్ళు, సీనియర్స్ కొందరు కుళ్ళు రాజకీయాలు ప్రదర్శిస్తారని.. తనని తాను నిరూపించుకుని ఎదుగుతున్న టైంలో ఆ కుళ్ళు రాజకీయాలని భరించలేకపోయానని నూకరాజు కుండబద్దలు కొట్టేశాడు. అసలు జబర్దస్త్ షోలో ట్యాలెంట్ గురించి పట్టించుకునేది చాలా తక్కువ. వాళ్ళకి కావలసిన వాళ్ళని మాత్రమే హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారు.. అంటూ సన్సేషనల్ కామెంట్స్ చేసాడు.
అసలు డైలాగ్ చెప్పడం కూడా రానివాళ్ళని బలవంతంగా హైలైట్ చేయాలనీ చూస్తారు. కొన్నిసార్లు ఈ రాజకీయాలు భరించలేక ముఖం మీద అడిగేసిన సందర్భాలు ఉన్నాయి.
అలా నేను ధైర్యం చేసి అడిగినప్పుడు నన్ను కొన్ని ఎపిసోడ్స్ నుంచి తీసేశారు. కొన్నిసార్లు ప్రోమోలో కూడా నేను కనపడకుండా చేసేవారు. దీనివల్ల చాలా సందర్భాల్లో మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యా. ఇంత రాజకీయం జరుగుతున్నా నన్ను నా రైటింగ్ కాపాడింది. అదే నన్ను ఆడియన్స్ కి చేరువ చేసింది అని నూకరాజు జబర్దస్త్ కుళ్ళు రాజకీయాలని బయటపెట్టాడు.