Advertisementt

SSMB 29 కోసం రాజమౌళి యూనిక్ డెసిషన్

Thu 18th Apr 2024 10:05 AM
ssmb29  SSMB 29 కోసం రాజమౌళి యూనిక్ డెసిషన్
Unique Concept planned for SSMB29 SSMB 29 కోసం రాజమౌళి యూనిక్ డెసిషన్
Advertisement
Ads by CJ

దర్శకధీరుడు ఏది చేసినా యూనిక్ గా ఉండాలని ఆలోచించే వ్యక్తి. అందుకే ఆర్.ఆర్.ఆర్ విడుదలై రెండుళ్లు గడిచిపోయినా తొందరపడి మహేష్ సినిమా విషయంలో అప్ డేట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజమౌళి ఏ చిత్రమైనా మొదలు పెట్టేటప్పుడు ఆ చిత్ర కాన్సెప్టు ని చెప్పి మరీ ముహూర్తం పెడతారు. ఈసారి రాజమౌళి మహేష్ తో చెయ్యబోయే SSMB 29 ని ఎప్పుడు మీడియా ముందు అనౌన్స్ చేయబోతున్నారో అనే ఆత్రుత, ఆరాటం మహేష్ అభిమానుల్లోనే కాదు యావత్ పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఉంది.

అయితే రాజమౌళి ఈసారి మహేష్ మూవీ గురించి కాన్సెప్ట్ గురించి మీడియా ముందు మూడు ముక్కల్లో తెల్చేయ్యకుండా.. ఓ కాన్సెప్ట్ వీడియో ని రూపొందించి దానిని వదిలిలేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ వీడియోలోనే కథ కమామిషు గురించి, పాత్రల తీరు తెన్నులపై చిన్న చిన్న క్లూస్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఆ కాన్సెప్ట్ వీడియో కి సంబందించిన క్రియేటివ్ వర్క్ కూడా మొదలైంది అనే టాక్ ఇప్పుడు మహేష్ అభిమానులని నిలువనియ్యడం లేదు.

SSMB 29 కథ ఎపుడో పూర్తయ్యింది, స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తి కావొస్తుంది. అన్ని బాగానే ఉన్నా మహేష్ తో రాజమౌళి కలిసి దిగే ఫోటో కోసము, అలాగే SSMB 29 పై వచ్చే అప్ డేట్ కోసము అందరూ ఎదురు చూస్తున్నారు. 

Unique Concept planned for SSMB29:

SSMB29: Rajamouli Coming With A Unique Concept

Tags:   SSMB29
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ