కోలీవుడ్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. అయితే విశాల్ తాజాగా ఏపీకి జగన్ మరోమారు సీఎం అవుతాడని చెప్పిన మాట చాలా సెన్సేషన్ అయ్యింది. విశాల్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తాను జగన్ మళ్ళీ సీఎం అవుతారని అంటే పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. గత ఎన్నికల సమయంలోను ఎవరు సీఎం అవుతారంటే జగన్ సీఎం అవుతారని అన్నాను, ఇప్పుడు కూడా అదే మాదిరి చెప్పాను.. అది ఇంత కాంట్రవర్సీ అవ్వుద్ది అనుకోలేదు అన్నాడు.
ఇక మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని అడగగానే.. పెళ్లి అనేది జరగాలి, ఒక అమ్మాయికి నేను తగిన సమయం ఇచ్చినప్పుడు, సంతోషంగా ఉంచినప్పుడు పెళ్లి చేసుకుంటాను. పెళ్లి అనేది ఆట కాదు.. ఒక అమ్మాయి మనల్ని నమ్మి వచ్చినపుడు ఆమెని కష్టపెట్టకూడదు, నేను సినిమాలు, షూటింగ్స్, పాలిటిక్స్ అంటూ బిజీగా వుంటాను. అమ్మాయికి నేను సమయం కేటాయించలేనప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు, నాకు బాధ్యతలున్నాయి. ఖాళీగా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు, కానీ ప్రస్తుతం నేను బిజీ అంటూ పెళ్లిపై విశాల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటనకు థియేటర్స్ లో క్లాప్స్ కొట్టడం ఇవన్నీ ఆమెని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఇక ఆమె వ్యక్తిగత లైఫ్ లో సెటిల్ అయ్యేలా డెసిషన్ తీసుకోవడం హ్యాపీ గా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.