యంగ్ హీరోలు, స్టార్ హీరోలు తమ సినిమాలతో పోటీ పడడం అనేది కామన్. అప్పుడే బాక్సాఫీసు బరి హీటకెక్కుతుంది, మంచి జోరుగా కనిపిస్తుంది. ఎక్కువగా సంక్రాంతి, దసరా సమయంలో స్టార్ హీరోల మధ్యన పోటీ కనబడితే ఫిబ్రవరి, ఆగస్టు, డిసెంబర్ లో కుర్ర హీరోలు పోటీ పడతారు. ఫిబ్రవరి రెండో వారం, ఆగష్టు రెండో వారం, డిసెంబర్ మూడో వారంలో ఈ యంగ్ హీరోల ఫైట్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.
ఇక ఈ ఏడాది నాగ చైతన్య-నితిన్ లు ఒకే రోజు పోటీ పడడానికి రెడీ అవుతున్నారు. నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ ఒకే రోజు ఫైట్ చేసుకోబోతున్నాయి. అది కూడా డిసెంబర్ 20 నే. డిసెంబర్ 20 న నితిన్ రాబిన్ హుడ్, నాగ చైతన్య తండేల్ విడుదలకు మేకర్స్ డేట్స్ ఎనౌన్స్ చెయ్యబోతున్నారు కాదు ఇప్పటికే నితిన్ రాబిన్ హుడ్ ని డిసెంబర్ 20, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
వరస వైఫల్యాలతో నిరాశలో ఉన్న నితిన్ ని భీష్మ దర్శకుడు వెంకీ కుడుములు రాబిన్ హుడ్ తో సక్సెస్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే.. పాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి నాగ చైతన్యకి తండేల్ తో విజయాన్ని కట్టబెట్టాలని చూస్తున్నాడు. మరి డిసెంబర్ 20 న పోటీ పడే ఈ యంగ్ హీరోల్లో ఎవరు సక్సెస్ సాధిస్తారో చూడాలి.