జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా చంద్రబాబు, పవన్, పురంధరేశ్వరిలపై హాట్ కామెంట్స్ చేస్తున్నాడు.
చంద్రబాబు పెత్తందారునిగా జమ కడుతున్న జగన్ పవన్ ని దత్తపుత్రుడిగా సంభోదిసూ ఆయనపై పదే పదే పెళ్లిళ్లపై అలిగేషన్ చేస్తున్నాడు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ.. విపక్ష నేతలైన చంద్రబాబుపైన, జనసేనాని పవన్ కల్యాణ్ పైన ధ్వజమెత్తారు. దత్తపుత్రుడికి బీపీ వస్తే తట్టుకోలేం. అతడిలోనూ బీపీ బాగా కనిపిస్తోంది. దత్తపుత్రా, దత్తపుత్రా... పెళ్లికి ముందు పవిత్ర హామీలు ఇచ్చి, పిల్లల్ని కని, నాలుగైదేళ్లకోసారి కార్లను మార్చినట్టు భార్యలను, భార్యలను మార్చినట్టు నియోజకవర్గాలను అలవోకగా మార్చేస్తున్నావు... ఏం మనిషివయ్యా నువ్వు అని అడిగా. అయ్యా దత్తపుత్రా ఒకసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు... పదే పదే చేస్తుంటే దాన్ని అలవాటు అంటారయ్యా... పవిత్ర సంప్రదాయాన్ని నడిరోడ్డు మీదకు తీసుకురావడం, ఆడవారి జీవితాలను చులకనగా చూపించడం తప్పుకాదా అని అడిగా.
నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ చేస్తే, ఇలా భార్యలను మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకు ఏం కావాలి.. అని అడిగా. అంతే... ఆ పెద్ద మనిషిలో బీపీ పెరిగిపోతోంది... చేతులు ఊపుతూ, కాళ్లు ఊపుతూ, తల ఊపుతూ మనిషంతా ఊగిపోతాడు. దత్తపుత్రుడికి బీపీ వస్తే తట్టుకోలేం అంటూ సీఎం జగన్ పవన్ పై చేసియాన్ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.
పవన్ ని విమర్శించేందుకు ఏమి లేక అతని పర్సనల్ లైఫ్ గురించి పదే పదే ప్రజల ముందు ప్రస్తావిస్తున్నావు, నువ్వు ముఖ్యమంత్రివి ఎలా అయ్యావ్, మరోసారి అధికారం ఇస్తే ఏపీని ఏం చేస్తావో ఈ ఐదేళ్ళలో ప్రజలు చూసేసారు.. పవన్ విషయంలో అతన్ని విమర్శించేందుకు ఏమిలేక ఇలా జగన్ మాట్లాడడం కరెక్ట్ కాదా అనేది అతని విజ్ఞతకే వదిలేస్తున్నాము అంటూ జన సైనికులు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.