మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో, ఇంకెన్ని స్పెషల్ న్యూస్ లు వినిపిస్తాయో అనే ఆత్రుతని అంతకంతకు కన్నప్ప టీమ్ పెంచుతూనే ఉంది. నిన్న మంగళవారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కన్నప్ప ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన అప్ డేట్ అందించారు. అదే కన్నప్పకి బిగ్ అసెట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే మోహన్ బాబు మీద అభిమానంతో ఈ ప్రోజెక్ట్ లో నటిస్తున్నారు అనుకుంటే., అక్షయ్ కుమార్ లాంటి వారు అభిమానము కోసం రారు కదా..!
ఇక ఈ ప్రోజెక్ట్ లో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ లాంటి క్రేజీ స్టార్స్ కనిపించబోతున్నారు. పాత్రలు ఎంత చిన్నవయినా, పెద్దవయినా వారు కనిపించారంటే ఆ చిత్రంపై ఆయా స్టార్స్ అభిమానుల్లో పిచ్చ క్రేజ్ ఉంటుంది. అందుకే కన్నప్ప స్పెషల్స్ పై అందరిలో అంతకంతకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈప్రాజెక్టు లోకి మరో క్రేజీ హీరోయిన్ రాబోతుంది అని తెలుస్తోంది.
అదే కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ కన్నప్పలో భాగం కాబోతున్నట్టుగా, త్వరలోనే ఆమె కన్నప్ప సెట్స్ లో జాయిన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అనుష్క పార్వతి పాత్రలో కనిపించబోతుంది అని ఒకసారి, నయనతార పార్వతి పాత్ర అని మరోసారి.. ఇప్పుడు కాజల్ పార్వతి పాత్రలో కనిపించే ఛాన్స్ వుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
అక్షయ కుమార్ హర హర మహాదేవ అంటే శివుని రూపంలో కనిపిస్తారని క్లూ కూడా ఇచ్చారు. ప్రభాస్ నందీశ్వరుని లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతుంది.