హరి హర వీరుమల్లు షూటింగ్ ఆగిపోయి ఏడాదిన్నర గడిచిపోయింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందో.. లేదో కూడా తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లు షూటింగ్ పై ఇంకా సందిగ్దత నడుస్తుంది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడం ఆపేసాక ఈ మధ్యలో వీరమల్లు సెట్స్ కాలిపోవడం, తర్వాత క్రిష్ సైలెంట్ అవడం, రీసెంట్ గా క్రిష్ డైరెక్షన్ లో మరో మూవీ మొదలు కావడం ఇవన్నీ వీరమల్లు పై అనుమానాలు పెంచేసింది.
అయితే రీసెంట్ గా ముంబై లో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో హరి హర వీరమల్లు డిజిటల్ హక్కులు దక్కించుకున్నందుకు గాను దర్శకనిర్మాతలు స్టేజ్ పైకి పిలిచారు. అప్పుడు పవన్ ఫాన్స్ లో కాస్త ఆనందం కలిగింది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదు అనుకున్నారు. ఆ తర్వాత ఏఏంరత్నం అప్పుడప్పుడు హరి హర వీరమల్లు పై చిన్న చిన్న అప్ డేట్స్ ఇచ్చారు. అయినప్పటికి ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు తీరలేదు.
ఇప్పుడు సడన్ గా శ్రీరామనవమి హరి హర వీరమల్లు నుంచి కొత్త పోస్టర్ తో శ్రీరామనవమి సుభాకాంక్షలు తెలియజేయం అనేది అందరిని ఆశ్చర్యపరిచింది. జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో… Team #HariHaraVeeraMallu is set to release the teaser Out Soon! 🔥 అంటూ వీరమల్లు టీజర్ త్వరలోనే రాబోతున్నట్టుగా ఇచ్చిన అప్ డేట్ కి అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు.