ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ తర్వాత అందులో నటించిన గ్లామర్ హీరోయిన్ నిధి అగర్వాల్ టాప్ పొజిషన్ కి చేరుకుంటుంది, ఆమెకి వరసగా స్టార్ హీరోలు ఛాన్స్ లు ఇచ్చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఇస్మార్ట్ హిట్ తర్వాత నిధి అగర్వాల్ నటించిన సినిమా ఏది ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈమద్యలో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లులో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. కొద్ధి రోజులు షూటింగ్ లో పాల్గొంది. నిధి అగర్వాల్ హరి హర వీరమల్లు ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.
ఆ చిత్రం షూటింగ్ ఇకపై జరుగుతుందో లేదో అనేది పెద్ద క్వచ్చన్ మార్క్. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో తెలియదు. అలా నిధిని పవన్ వదిలేస్తే ప్రభాస్ ఆదుకున్నాడు. ప్రభాస్-మారుతి కలయికలో తెరకెక్కుతున్న రాజా సాబ్ లో ముగ్గురిలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది.
అందులో మాళవిక మోహనన్, నిది అగర్వాల్ హీరోయిన్స్ కాగా.. ప్రస్తుతం జరుగుతున్న రాజా సాబ్ షెడ్యూల్ లో నిధి అగర్వాల్ పాల్గొంటుందని సమాచారం అందుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ద రాజా సాబ్ సినిమా షూటింగ్ ను దర్శకుడు మారుతి చిత్రీకరిస్తున్నారట. అలా హరి హర వీరమల్లు మిస్ అయినా.. రాజా సాబ్ తో నిధి మళ్ళీ యాక్టీవ్ అయ్యింది.