నయనతార 40 ప్లస్ లోకి అడుగుపెడుతున్నా ఆమె మాత్రం ఫిట్ గా అందంగా అద్భుతమైన లుక్స్ లో మెస్మరైజ్ చేస్తూనే ఉంది, ఉంటుంది. యంగ్ హీరోలు లేదు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లేదు, స్టార్ హీరోలు లేదు ఏ సినిమాకైనా నయనతార సెట్టవుతుంది అనేలా ఉంటుంది. అందుకే స్టార్ హీరోల దగ్గ నుంచి డెబ్యూ హీరోల వరకు నయనతారని కాదనకుండా సెలెక్ట్ చేసుకుంటారు.
లేడీ సూపర్ స్టార్ గా సౌత్ లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నయనతార ఈమధ్యన ఫ్యామిలీతో ఎక్కువగా కనబడుతుంది. విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుని కవలల పిల్లలకి సరోగసి మదర్ అయిన నయనతార పిల్లలతో ఆటపాటలు, వాళ్ళ సంరక్షణలో చాలా బిజీగా ఉంటుంది. హిందీ జవాన్ హిట్ తర్వాత నయన్ ఎక్కువగా ఫ్యామిలీతోనే కనిపిస్తుంది. రీసెంట్ గా విగ్నేష్, పిల్లలతో కలిసి నయన్ తమిళ ఉగాదిని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది.
తాజాగా నయనతార శారీ లో కళ్ళు చెదిరే లుక్ లో మెస్మరైజ్ చేసింది. నయనతార ఈ లుక్ ఓ యాడ్ షూట్ కోసం అని తెలుస్తోంది. క్రీమ్ కలర్ శారీ లో నయనతార నెక్ కి ముత్యాల చోకర్ వేసుకుని హెయిర్ ముడి కట్టి ఫొటోలకి ఫోజులిచ్చింది. ఆమె చూపులు చురకత్తుల్లా ఉన్నాయి. ప్రస్తుతం నయనతార ట్రెడిషనల్ శారీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.