శ్రీలీల కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. వరస సినిమాలు ఆమెని నిరాశ పరిచే విధంగా రిజల్ట్ రావడంతో శ్రీలీల ప్రస్తుతం కామైపోయింది. అయితే వరసగా సినిమాలు ఆమెని డిస్పాయింట్ చెయ్యడం ఒక ఎత్తైతే.. ఆమెకి టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్ షాకివ్వడం మరొక ఎత్తు. అందులో ఒకటి VD 12. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కే ప్రాజెక్ట్ లో ముందుగా శ్రీలీలనే హీరోయిన్. ఆమెని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించి మరో హీరోయిన్ కోసం టీమ్ వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడు మరో హీరో శ్రీలీలకి షాకిచ్చాడు అంటున్నారు. అదే హీరో నితిన్. నితిన్-వెంకీ కుడుముల రాబిన్ హుడ్ లో ముందుగా లక్కీ గర్ల్ రష్మికని అనుకుంటే.. ఆమె ఈప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో రష్మిక ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. ఆ విషయాన్ని నితిన్ కూడా ఎక్సట్రార్డినరీ మ్యాన్ ప్రమోషన్స్ లో చెప్పాడు. కట్ చేస్తే ఇప్పడు శ్రీలీల ప్లేస్ లోకి రాశి ఖన్నా వచ్చింది పడింది అందులో న్యూస్ హైలెట్ అయ్యింది.
టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలే కాదు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సరసన నటించినా తన కెరీర్ కి బ్రేకిచ్చే సినిమా దొరకలేదు రాశి ఖన్నా కి. మొదటి నుంచి గ్లామర్ పాత్రలతోనే హైలెట్ అయిన రాశి ఖన్నా కి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేకపోవడం మైనస్ అయ్యింది. కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమాల్లో కనిపించని రాశి నితిన్-వెంకీ కుడుములు రాబిన్ హుడ్ లో నటిస్తుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. రాబిన్ హుడ్ సినిమాలో రాశి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
అయితే రాశి ఖన్నా శ్రీలీల ప్లేస్ లోకి వచ్చిందా.. లేదంటే మరో హీరోయిన్ గా కనిపించనుందా అనేది తెలియాల్సి ఉంది.