క్వార్టర్.. మనీ.. వైఎస్ జగన్‌పై అటాక్!
హెడ్డింగ్ చదవగానే ఇదేంట్రా బాబోయ్ ఇంత సిల్లీగా ఉందని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. మీరు ఆశ్చర్యపోయినా.. అంతకుమించి షాకైనా ఇదే నిజమండోయ్!. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడి జరిగిన ఘటన పెను సంచలనమైన సంగతి తెలిసిందే. ఇదంతా టీడీపీ పనేనని వైసీపీ.. ఎన్నికల ముందు ఇవన్నీ జగన్ రెడ్డికి అలవాటేనని కూటమి ఓ రేంజ్‌పై విమర్శలు గుప్పించుకున్నాయి. సీన్ కట్ చేస్తే.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగడంతో కారకులెవరు..? ఎందుకు చేయాల్సి వచ్చింది..? అనే విషయాలను తెలుసుకునే పనిలో రెండ్రోజులుగా 8 ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. నిందితుడు ఎవరనేది దాదాపు తెలిసిపోయినట్టేనని సమాచారం. ఎందుకంటే.. గత 24 గంటలకు అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన కొందరు యువకులను అనుమానితులుగా భావించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. సతీష్ అనే యువకుడు చెప్పిన మాటలు విని పోలీసులే ముక్కున వేలేసుకున్న పరిస్థితి నెలకొందట.
ఇదీ అసలు సంగతి!
సీసీ టీవీ ఫుటేజీను నిశితంగా పరిశీలించిన పోలీసులు సతీష్ నిందితుడిని తేల్చినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అవును.. జగన్ సభకు అందరితో పాటు నేనూ వచ్చాను. సభకు వచ్చినందుగాను వైసీపీ నేతలు.. నాకు క్వార్టర్ బాటిల్, 350 రూపాయిలు డబ్బులు ఇస్తామని ఆశచూపారు. సభకు వచ్చిన తర్వాత మందు బాటిల్ మాత్రమే చేతిలో పెట్టి.. డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారు. అందుకే నాకు కోపం వచ్చింది.. జగన్‌ను రాయి తీసుకొని కొట్టాను అని పోలీసుల విచారణలో సతీష్ చెప్పినట్లు సమాచారం.
సతీష్‌తో పాటు ఆకాష్, దుర్గారావు, చిన్నా, సంతోష్‌లను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో నిజానిజాలెంత అని పోలీసులు క్రాస్ చెక్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా పోలీసులు ప్రకటించనప్పటికీ ఇప్పుడీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
నమ్మొచ్చా..!
ఇప్పటికే దాడికి సంబంధించి పెద్ద ఎత్తున మీమ్స్, వీడియోలతో ట్రోల్ చేస్తుండగా.. తాజాగా బయటికొచ్చిన లీకులతో అబ్బో ఆ సెటైర్లు అయితే చూడలేం. ఇక టీడీపీ అయితే.. క్వార్టర్ మేటర్.. ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే.. మండదా అక్కా!.. మండదా చెల్లీ!.. మండదా తమ్ముడు!.. మండదా అన్నా! అని యువనేత నారా లోకేష్.. వైఎస్ జగన్‌ను అనుకరిస్తూ సెటైర్లేశారు. మరోవైపు.. నిందితుడిగా భావిస్తున్న సతీష్ తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరవుతున్నారు. తన కుమారుడికి ఏ పాపం తెలియదని.. మత్తు పదార్ధాలు తీసుకున్నాడని పోలీసులు తీసుకెళ్లినట్లు గగ్గోలు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళితే అక్కడ తన కుమారుడు లేరని.. పోలీసులు కూడా ఎటువంటి సమాచారం చెప్పడం లేదని చెబుతున్నారు. తనకు కుమారుడిని అప్పగించి న్యాయం చేయాలని పోలీసులను సతీష్ తల్లి వేడుకుంటున్నారు. సతీష్ అనే యువకుడు నిజంగానే దాడి చేశాడా..? లేదా అన్నది మాత్రం ఇంకా తేలలేదు. నిజానిజాలు తెలియాలంటే దర్యాప్తు పూర్తయ్యే వరకూ వేచి చూడాల్సిందే మరి.