నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ ప్రచారంలో బిజీగా కనిపిస్తున్నారు. హిందూపూర్ నుంచి పోటీ చేస్తున్న బాలయ్య ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మరోపక్క బాబీ తో చేస్తున్న NBK 109 చిత్రానికి చిన్నపాటి బ్రేకిచ్చారు. ఈ చిత్రం తర్వాత బాలయ్య ఏ దర్శకుడితో సినిమా చేస్తారో అందరికి ఓ క్లారిటీ ఉంది. అది బోయపాటి తో ఆయన అఖండ 2 ని స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
అఖండ తో బోయపాటి-బాలయ్య హ్యటిక్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ గా అఖండ 2 ఉంటుంది అని ఎప్పుడో చెప్పారు. దానితో అఖండ 2 పై ట్రేడ్ లో భీభత్సమైన అంచనాలు మొదలయ్యాయి. తాజాగా బోయపాటి ఓ గుడి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన అఖండ 2 పై సాలిడ్ అప్ డేట్ అందించడంతో నందమూరి అభిమానులు చాలా ఎగైట్ అవుతున్నారు. అఖండ మూవీలో ఎలాంటి కాన్సెప్ట్ అయితే ఉందో అలాగే సమాజానికి ఉపయోగపడే ఎలిమెంట్ తోనే అఖండ 2 కూడా ఉండబోతోందని ఇచ్చిన అప్ డేట్ ఇప్పడు వైరల్ అయ్యింది.
అంతేకాకుండా ఏపీలో ఎన్నికలు హడావుడి ముగిసిన తర్వాత అఖండ 2కి సంబందించిన అప్డేట్ ఉంటుందని, డివైన్ ఎలిమెంట్ కూడా కథలో అంతర్లీనంగా ఉంటుందని, దానిని ఎంత వరకు చెప్పాలో అంత చెబితే చాలని, దానినే ఆడియన్స్ ఆశ్వాదిస్తారని బోయపాటి చెప్పుకొచ్చాడు. మరి ఇలాంటి చిన్నపాటి అప్ డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద అప్ డేట్స్ గా మారి వైరల్ అవుతున్నాయి.