సమంత చేతిలో సినిమాలు లేవు, ఆమెకి సక్సెస్ వచ్చి చాలా రోజులైంది. ప్రస్తుతం సమంత ఎలాంటి సినిమా షూటింగ్ లో పాల్గొండడం లేదు. కానీ సమంత కోసం వెతికే అభిమానులు ఎంతెలా ఉన్నారంటే సమంత నెంబర్ 1 పొజిషన్ లో నించో బెట్టేంతగా వెతికేస్తున్నారు. ఆమె సినిమాలు చెయ్యకపోయినా, షూటింగ్స్ లో లేకపోయినా, సక్సెస్ రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఫొటో షూట్స్, పర్సనల్ విషయలంటూ క్రేజీగా కనిపిస్తుంది.
అందుకే ఆర్మాక్స్ మీడియా సంస్థ తాజా సర్వే లో సమంత నెంబర్ 1 పొజిషన్ లో కూర్చుకుంది. ఇది చూడడానికి, వినడానికి వింతగానే అనిపించినా.. తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ అభిమానుల ఓటింగ్ ను ఆధారంగా చేసిన సర్వే లో సమంత నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న, ట్రెండింగ్ లో ఉన్న టాప్ టెన్ హీరోయిన్లను వెల్లడించింది.
ఆ లిస్ట్ లో సమంత టాప్ 1లో నిలిస్తే.. టాప్ 2 లో కాజల్ అగర్వాల్, టాప్ 3 లో అనుష్క శెట్టి నిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక టాప్ 4లో శ్రీలీల, టాప్ 5 లో సాయి పల్లవి, టాప్ 6 లో రష్మిక మందన్న నిలిచారు. టాప్ 7 లో కీర్తి సురేష్, టాప్ 8 లో తమన్నా, టాప్ 9 లో పూజా హెగ్డే, టాప్ 10 లో అనుపమ పరమేశ్వర్ వరస స్థానాల్లో నిలిచారు.