Advertisementt

బాలయ్యకు ఇంత ఘోర అవమానమా..?

Mon 15th Apr 2024 09:28 PM
balakrishna  బాలయ్యకు ఇంత ఘోర అవమానమా..?
Balayya is such a big shame..? బాలయ్యకు ఇంత ఘోర అవమానమా..?
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణకు టీడీపీలో ఘోర అవమానం జరుగుతోందా..? నందమూరి వంశం నుంచి పుట్టిన పార్టీలోనే ఆయనకు ఎందుకింత అవమానం..? అసలు బాలయ్య టీడీపీకి అక్కర్లేదా..? ఇందుకు గత నాలుగు రోజులుగా జరుగుతున్న కీలక పరిణామాలే తార్కాణమా..? అంటే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. దీంతో నందమూరి వీరాభిమానులు, టీడీపీలోని బాలయ్య భక్తులు, ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇంత అవమానం జరుగుతున్నా సార్ ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు..? అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంతకీ బాలయ్యకు జరిగిన అన్యాయమేంటి..? ఇందులో నిజానిజాలెంత..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం రండి.

ఇదీ అసలు సంగతి!

తెలుగుదేశం పార్టీ నందమూరి వంశం నుంచి పుట్టిన పార్టీ. నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించి ఆంధ్రుల ఆరాధ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ వేదికగా ఏం జరిగింది..? తదనాంతరం ఎవరి చేతుల్లోకి పార్టీ వచ్చింది..? ఇప్పుడు ఎవరేలుతున్నారనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లకు పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉందో.. కనీసం అందులో సగం కూడా లేదన్నది నందమూరి అభిమానుల నుంచి వస్తున్న మొదటి ప్రశ్న. నందమూరి వారసుడు అయినప్పటికీ ఆయన్ను ఎందుకింతలా చులకనగా చూస్తున్నారని బాలయ్య అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నాన్న పెట్టిన పార్టీ.. రాయలసీమలో మూడంటే మూడు సీట్లనే 2019 ఎన్నికల్లో దక్కించుకోగా ఈసారి సైకిల్ సత్తా ఏంటో చాటి చెప్పాలని స్వర్ణాంధ్ర సాకార యాత్రకు బాలయ్య శ్రీకారం చుట్టారు. మూడ్రోజులుగా బాలయ్యకు నిజంగా వస్తున్న ఆదరణ చూసిన చంద్రబాబు, లోకేష్.. ఇతర అగ్రనేతలు ముక్కున వేలేసుకున్నారట.

ఎవరికీ పట్టదా..?

వాస్తవానికి ప్రజాగళం, యువగళం, నిజం గెలవాలి.. బాబు రావాలి ఇలాంటి కార్యక్రమాలతో చంద్రబాబు, నారా లోకేష్.. నారా భువనేశ్వరి రాయలసీమలో సభలు నిర్వహించినప్పటికీ ఆదరణ అంతంత మాత్రమే వచ్చిందని చెప్పుకోవాలి. అయితే.. బాలయ్యకు మాత్రం వారెవ్వా ఇదీ నందమూరి బిడ్డ పౌరుషం అన్నట్లుగా జనాధరణ లభించింది. ఎందుకంటే ఆయనుకున్న చరీష్మా.. కరేజ్ అలాంటిది మరి. ఇంత జరుగుతున్నా మూడ్రోజులుగా బాలయ్య యాత్రను టీడీపీ అనుకూల మీడియా కానీ.. దినపత్రికలు కానీ.. కనీసం యూ ట్యూబ్ చానెల్స్ కానీ పట్టించుకోలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే టీడీపీ అఫిషియల్ సోషల్ మీడియా పేజీల్లో కూడా కనీసం రియాక్షన్స్ లేకపోవడం గమనార్హం. దీంతో బాలయ్యకు బావ బాబు నుంచి.. అల్లుడు లోకేష్ నుంచి ఎలాంటి ఆదరణ లేదని స్పష్టంగా అర్థమవుతోంది. టీడీపీ సోషల్ మీడియా మొత్తం ఎవరి చేతుల్లో ఉందనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఇంత అన్యాయమా..?

మూడ్రోజులుగా రాయలసీమలో జరుగుతున్న పరిణామాలు, టీడీపీ చేస్తున్న ట్వీట్లు, బాలయ్యకు వస్తున్న సపోర్టు చూస్తుంటే వందకు వెయ్యి శాతంగా ఆయన్ను టీడీపీ అగ్రనాయకత్వం చిన్నచూపు చూస్తోందని.. ఘోరంగా అవమానిస్తోందన్నది నందమూరి అభిమానులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. వాస్తవానికి చంద్రబాబు, లోకేష్ కంటే బాలయ్యకు దక్కాల్సిన గౌరవం ఎక్కువే ఉండాలి కానీ.. ఎందుకు దక్కట్లేదు అన్నది నందమూరి వీరాభిమానుల నుంచి వస్తున్న ప్రశ్న. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. బాబు, చినబాబు, భువనేశ్వరి ముగ్గుర్నీ మించిన ఆదరణ రాయలసీమలో బాలయ్యకు దక్కిందని అందుకే.. టీడీపీ సోషల్ మీడియాలో కానీ.. అనుకూల మీడియాల్లో కానీ ఎక్కడా బాలయ్య కనిపించడానికి వీల్లేదని క్లియర్ కట్‌గా ఆదేశాలు వెళ్లాయట. ఒకవేళ చూపించాల్సి వస్తే.. ఏదైనా హాట్ కామెంట్స్ చేస్తే తప్ప.. అది కూడా చూపించలేదనే మాట రాకుండా జస్ట్ చూపించాలంతే అని ఒకింత హెచ్చరికలే వెళ్లాయని తెలియవచ్చింది. ఈ వార్త చదివాక.. నిజంగా బాలయ్యకు అవమానం, టీడీపీలో ఆదరణ ఉందా లేదా అన్నది మీకే అర్థమయ్యి ఉంటుంది కదూ..!

Balayya is such a big shame..?:

Is it so unfair to Balakrishna?

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ