కోలీవుడ్ నటి వరలక్ష్మి కి తమిళనాట కన్నా ఎక్కువగా తెలుగులో నటిగా గుర్తింపు వచ్చింది. వీర సింహ రెడ్డి, హనుమాన్ లాంటి చిత్రాలతో వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా ప్రూవ్ చేసుకుంది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ రీసెంట్ గానే ముంబై కి చెందిన బిజినెస్ మ్యాన్ నికోలాయ్ సచ్ దేవ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అంతేకాదు ఈ ఏడాదిలోనే వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా చెప్పింది.
అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గతంలో హీరో విశాల్ ప్రేమలో ఉంది, ఆమె విశాల్ నే వివాహం చేసుకుంటుంది అనుకున్నారు. విశాల్-వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరూ లవ్ లో ఉన్నారు. నడిఘర్ సంఘ నిర్మాణం అయితే విశాల్-వరలక్ష్మిలు ఆ మండపంలో మొదటి వివాహం చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే నడిఘర్ ఎన్నికల సమయంలో వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కి విశాల్ కి తీవ్రమైన వాదోపవాదాలు, గొడవలు జరిగాయి.
ఆ గొడవల తర్వాత వరలక్ష్మి-విశాల్ దూరమయ్యారు అనే టాక్ ఉంది. అదంతా అలా అంటే తాజాగా విశాల్.. వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం పై స్పందించాడు. వరలక్ష్మి పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీ గా ఉంది, సినిమా పరిశ్రమలో తనని తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడింది. తాను అనుకున్నది సాధించింది. తెలుగులో వరలక్ష్మి మంచి పేరు తెచ్చుకుంది. వరలక్ష్మి తల్లిని నేను కూడా అమ్మే అంటాను.
వరలక్ష్మి చాలా మంచి మనిషి. ఆమె పర్సనల్ లైఫ్ లో సెటిల్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆమెకి నా హృదయ పూర్వక శుభాకంక్షాలు తెలియజేస్తున్నాను అంటూ విశాల్ వరలక్ష్మి పెళ్లి పై స్పందించాడు.